ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

Nov 18 2025 7:32 AM | Updated on Nov 18 2025 7:32 AM

ట్రస్

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

తాండూరు టౌన్‌: తెలంగాణ రికగ్నైజ్డ్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ట్రస్మా) సోమవారం జిల్లా నూతన కార్యవర్గ నియామకం చేపట్టింది. జిల్లా అధ్యక్షుడిగా ఎన్‌.వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వీరేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి.అభిలాష్‌ రెడ్డి, కోశాధికారిగా వి.ప్రకాశ్‌చారి, సంయుక్త కార్యదర్శిగా ఎ.కిరణ్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ 2027 వరకు పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలు పాఠశాలల మేనేజ్‌మెంట్‌ సభ్యులు అభినందించారు.

వ్యక్తి అదృశ్యం

బషీరాబాద్‌: పనికోసం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని నావంద్గిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నుమాన్‌ అలీ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ జగ్గప్ప భార్యతో కలిసి బషీరాబాద్‌లోని ఓ నాయకుడి దగ్గర పనిచేస్తుంటారు. ఈ నెల 13న పనికోసం బషీరాబాద్‌ వెళ్తున్నాని చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగిరాకపోవడంతో సాధ్యమైన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులోఉంది.

ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ సీజ్‌

దోమ: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటన దోమ ఠాణా పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వసంత్‌ జాదవ్‌ తెలిపిన ప్రకారం.. పరిగి మండల పరిధి నజీరాబాద్‌ తండాకు చెందిన చంటి తన టిప్పర్‌ డ్రైవర్‌ సయ్యద్‌ యూనుస్‌తో కలిసి ఇసుక తరలిస్తున్నాడు. బొంరాస్‌పేట నుంచి ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు స్థానిక జూనియర్‌ కళాశాల వద్ద టిప్పర్‌ను పట్టుకున్నారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో టిప్పర్‌ను సీజ్‌ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

బొలెరో, జీప్‌ ఢీ

ముగ్గురికి గాయాలు

కుల్కచర్ల: ఎదురెదురుగా బొలెరో, కమాండర్‌(జీప్‌) ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం బండవెల్కిచర్ల శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారంబండవెల్కిచర్ల గ్రామానికి చెందిన కమాండర్‌ గ్రామానికి వెళ్తుండగా పీరంపల్లికి చెందిన బొలెరో మహిళా కూలీలతో కుల్కచర్ల వైపు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో రెండు వాహనాలు పాంబండ ఆలయం సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు, కమాండర్‌ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

భర్త చేతిలో భార్య హతం

ఇబ్రహీంపట్నం రూరల్‌: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కొట్టిచంపాడు. ఈ ఘటన ఆదిబట్ల పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కవితసాహు(23), వీరేశ్‌ దంపతులు ప్రేమ పెళ్లి చేసుకుని, రాజీవ్‌ గృహకల్ప బ్రహ్మణపల్లిలో నివాసం ఉంటున్నా రు. తాగుడుకు అలవాటుపడిన వీరేశ్‌ నిత్యం డబ్బుల కోసం భార్యను కొడుతుండేవాడు. ఆదివారం రాత్రి కూడా ఆమెతో గొడవ పడి సిమెంటు ఇటుకతో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్‌శాఖ చేవెళ్ల ఏడీ

రాజేశ్‌బాబు బదిలీ

చేవెళ్ల: విద్యుత్‌శాఖ చేవెళ్ల ఏడీ రాజేశ్‌బాబు బదిలీ అయ్యారు. ఆయన్ను హెడ్‌ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. సెప్టెంబర్‌లో మణికొండ విద్యుత్‌శాఖ ఏడీ అంబేడ్కర్‌పై ఏసీబీ దాడులు నిర్వహించగా ఆయనకు చేవెళ్ల ఏడీ రాజేశ్‌బాబు బీనామిగా ప్రస్తావనకు వచ్చింది. దీంతో రాజేశ్‌బాబు నివాసంలో దాడులు చేపట్టగా బాత్‌రూమ్‌లో రూ.17లక్షలు లభించిన విషయం విదితమే. రెండు నెలల క్రితం చోటు చేసుకున్న సంఘటనపై ఉన్నాతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. చేవెళ్ల ఏడీగా కొత్తగా ఎవరినీ నియమించలేదు.

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి 1
1/4

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి 2
2/4

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి 3
3/4

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి 4
4/4

ట్రస్మా జిల్లా అధ్యక్షుడిగా వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement