సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

Nov 18 2025 7:32 AM | Updated on Nov 18 2025 7:32 AM

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

పూడూరు: సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షీటీం డివిజన్‌ ఇన్‌చార్జి నర్సింలు సూచించారు. సోమవారం మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో సైబర్‌నేరాలు, బాల్యవివాహా నిర్మూలన, మానవ అక్రమ రవాణా తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఆన్‌లైన్‌ మోసాలు అధికమయ్యాయని అన్నారు. మహిళలపై నేరాలు, బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్యాంకింగ్‌ మోసాలు, గంజాయి, డ్రగ్స్‌ నిషేదం, మానవ అక్రమ రవాణా తదితర వాటి నిర్మూలించాలన్నారు. ఆపద సమయాల్లో డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాధిక, షీటీం సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

షీటీం డివిజన్‌ ఇన్‌చార్జి నర్సింలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement