రైతులకు వ్యాపార రుణాలు
ధారూరు: సహకార సంఘాల్లోని రైతులు రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడితే వ్యాపార రుణాలు అందజేస్తామని రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ అన్నపూర్ణ అన్నారు. సహకార వారోత్సవాల సందర్భంగా సోమవారం ధారూరు సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రైతు సంఘాలు రూ.15లక్షల వాటాధనం చెల్లిస్తే నేషనల్ డెవపల్‌మెంట్ కార్పొరేషన్ నుంచి మరో రూ.15లక్షలు ఇస్తామన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేసి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ధారూరు, హరిదాస్‌పల్లి సహకార సంఘాల చైర్మన్లు సత్యనారాయణరెడ్డి, వెంకట్‌రెడ్డి, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ జాయింట్ రిజిస్టార్‌లు సురేఖ వాణి, ప్రమీలాదేవి, సంగీత, శ్రీవల్లి, జిల్లా సహకార సంఘం అధికారి నాగార్జున, సీఈఓలు కె.నర్సింలు, రవికుమార్‌లు, సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.
రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ


