రోడ్లు బాగు చేయాలి
అనంతగిరి: రోడ్లు బాగుచేయాలని సోమవారం వామపక్ష పార్టీల నాయకులు ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో రోడ్లన్నీ పాడయ్యాయని ఏళ్లు గడుస్తున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. మంజూరైనా రోడ్ల పనులు ప్రారంభించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు వెంటనే స్పందించి రోడ్ల పనులు ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్, జిల్లా నాయకులు గోపాల్‌రెడ్డి, సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి మహేందర్, జిల్లా నాయకులు సుదర్శన్, సతీశ్, గీత, మహ్మద్ అక్బర్, లాలయ్య, మల్లేశ్, యాదయ్య, శ్రీనివాస్, ప్రభాకర్, రాములు, రాజు, దశరథ్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని ముట్టడించిన వామపక్ష నాయకులు


