టీబీ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి
జిల్లా ఉప వైద్యాధికారి రవీంద్రయాదవ్
తాండూరు: చలి తీవ్రత ఉన్నందున టీబీ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఉప వైద్యాధికారి రవీంద్రయాదవ్ అన్నారు. ఆదివారం తాండూరు జిల్లా ఆస్పత్రిలో పీపీ యూనిట్ విభాగంలో బసవ కంటి ఆస్పత్రి, సంజీవని ఆస్పత్రి ఆధ్వర్యంలో టీబీ వ్యాధిగ్రస్తులకు పండ్లు, నిత్యావసర సరుకుల కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ ఉన్నవారు చలిలో తిరగకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
తాండూరు: తాండూరులో జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తామని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తాండూరు బిగ్ బాష్ లీగ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. పోటీల్లో భాగంగా ఆదివారం ఆయన తాండూరు, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, అబ్దుల్ రవూఫ్, బిర్కట్ రఘు, ఇంతియాజ్, ఆదంఖాన్, అమ్జద్, మనీశ్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన
కార్యదర్శి శ్రీనివాస్
తాండూరు టౌన్: తాండూరులో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సంఘం కోశాధికారి చంద్రయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల నుంచి ఈఎస్‌ఐ పేరిట నగదు కోత విధిస్తున్నా వారికి ఆస్పత్రిని ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రి అందుబాటులో లేక పేద కార్మికులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వెంటనే డీసీఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో పాటు, కార్మిక చట్టాలు అమలవుతున్నాయో లేదో చూడాలన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిగి: బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌గా హన్మంత్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నగరంలో ఆయనకు నియామకపత్రం అందజేశారు. బీసీల అభ్యున్నతికి, బీసీల హక్కులపై పోరాడాలని సూచించారని చెప్పారు. తనపై నమ్మకంతో పదవీబాధ్యతలు అప్పగించిన ఆర్.కృష్ణయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
టీబీ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలి


