బ్రేక్ ఫెయిలై లారీ బోల్తా
అనంతగిరి: వికారాబాద్‌లో సమీపంలోని అన ంతగిరి గుట్ట ఘాట్ రోడ్‌పై ఆదివారం తాండూరు వైపు వెళ్తున్న నూనె లోడు లారీ ప్రమాదానికి గురైంది. బ్రేక్ ఫెయిల్ కావడంతో లారీ అదుపు తప్పి గుట్టను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న నూనె డబ్బా లు, ప్యాకెట్ కార్టన్లు రహదారిపై చెల్లా చె దురు గా పడి ఉన్నాయి. డ్రైవర్‌కు స్వల్ప గా యాలు కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
దుద్యాల్: వ్యక్తి అదృశ్యమైన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. దుద్యాల్ గ్రామానికి చెందిన కుమ్మరి శివప్ప, స్వప్న కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ వినాయక చవితికి మట్టి వినాయకులను తయారు చేసి హైదరాబాద్‌లో ఓ వ్యాపారికి విక్రయించారు. వాటికి సంబంధించి డబ్బులు తీసుకువస్తానని ఈ నెల 9న శివప్ప ఇంట్లో చెప్పి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో కంగారు పడిన అతడి భార్య స్వప్న ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పేదల సొంతింటి కల సాకారం
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్: ఇళ్లులేని నిరుపేదలకు సొంతింటి కలల్ని నిజం చేయడమే, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో నిర్మాణం పూర్తయిన రత్నమాల–రాములు దంపతుల ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నియోజకవర్గంలో చురుకుగా సాగుతున్నాయన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో నిరుపేదలకు ఒక్క ఇంటిని కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలోనే ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ గీత, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, నాయకులు శ్రీనివాస్, వెంకటేశ్, భారతమ్మ, రాఘవేందర్, యాదయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కుళ్లినస్థితిలో మృతదేహం లభ్యం
ఓఆర్‌ఆర్ పక్కనే చెట్లపొదల్లో గుర్తింపు
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం ఆదివారం కలకలం రేపింది. పూర్తిగా కుళ్లినస్థితిలో ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ కథనం ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీ బొంగ్లూర్ ఔటర్ సర్వీస్ రోడ్డుకు పక్కనే ఉన్న హెచ్‌ఎండీఏ వెంచర్ చెట్ల పొదల్లో కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. కంపు వాసన కొడుతుండగా వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు పరిశీలించి, వారం క్రితం మరణించి ఉండవచ్చని భావించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. ప్యాంట్, షర్టు ధరించి కాళ్లకు బూట్లు వేసుకొని చెట్ల పొదల్లో పడి ఉండడంతో హత్యా లేక ఆత్మాహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
పరిశీలించిన అడిషనల్ డీసీపీ
కుళ్లిన మృతదేహాన్ని మహేశ్వరం జోన్ అడి షనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు పరిశీలించారు. సంఘటనను బట్టి చూస్తే ఎలాంటి అనుమానం లేదని తెలిపారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించాయి. మృతుడి దుస్తుల్లో లభించిన ఫోన్‌బుక్ ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన చందు(41)గా పోలీసులు నిర్ధారించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ సమీపంలో మేసీ్త్ర పని చేసుకొని జీవిస్తున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి ఘటనాస్థలి వద్దే పోస్టుమార్టం నిర్వహించారు.
బ్రేక్ ఫెయిలై లారీ బోల్తా
బ్రేక్ ఫెయిలై లారీ బోల్తా


