స్విమ్మింగ్ పోటీల్లో విద్యార్థుల సత్తా
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆదివారం 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలబాలికల స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పి. సుభాష్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించేందుకు అనువైన మైదానాలు ఉన్నాయన్నారు. మొదటిసారిగా జిల్లాలో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. 800, 400, 200, 100, 50 మీటర్ల విభాగాల్లో జరిగిన పోటీల్లో 8 ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, పోటీల పర్యవేక్షుడు శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్, బాబురావు, వీవీ రెడ్డి, స్విమ్మింగ్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు గిరిధర్, శ్రీను, ఉమారావు, ఆంజనేయులు, నరసింహ, పీడీ రమేష్‌రెడ్డి, పీఈటీలు పాల్గొన్నారు.
గోల్డ్‌మెడల్స్ సాధించా
ప్రస్తుతం హైదరాబాద్‌లోని రైల్వే జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాను. తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. తండ్రి బాక్సర్‌గా రాణించాడు. నన్ను స్విమ్మింగ్ పోటీల్లో రాణించేలా ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు సార్లు గోల్డ్‌మెడల్స్ సాధించాను.
– భార్గవ్‌రామ్, హైదరాబాద్
జాతీయ పోటీల్లో పాల్గొన్నా
ప్రస్తుతం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మూడు సంవత్సరాల నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాను. ఎస్‌జీఎఫ్ పోటీ ల్లో పాల్గొంటూ ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యాను. ఇప్పటికే బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న. ఖేలో ఇండియా పోటీల వరకు వెళ్లాలని ఇష్టంగా ఆడుతున్నాను. – క్షేరజ, రంగారెడ్డి
స్విమ్మింగ్ పోటీల్లో విద్యార్థుల సత్తా
స్విమ్మింగ్ పోటీల్లో విద్యార్థుల సత్తా


