నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
షాద్‌నగర్: అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను త్వరలో మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణ శివారులో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. పేదలకు సీఎం రేవంత్‌రెడ్డి అండగా నిలుస్తున్నారన్నారు. షాద్‌నగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ విషయంలో ఎలాంటి రాజకీయాలకు చోటివ్వమని చెప్పారు. పూర్తిగా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ఇళ్ల సముదాయం వద్ద రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, నాయకులు విశ్వం, బాబర్, చెన్నయ్య, తిరుపతిరెడ్డి, ఇబ్రహీం, రాజేందర్‌రెడ్డి, రవికుమార్, ప్రవీణ్, అప్పి, జయ ప్రకాష్, మాధవులు, శంకర్, నాగమణి, రాజు, అర్జున్ లక్ష్మణ్, అశోక్, శ్రీధర్, అశోక్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


