పుస్తకాలు మంచి స్నేహితులు
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేశ్ బాబు
అనంతగిరి: పుస్తకాలు మంచి స్నేహితులని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేశ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గ్రంథ పాఠకులకు యోగాసనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యోగా గురువు రతన్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ యోగా చేయాలన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాఠకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ దొంగల ముఠా అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్ చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ హైదర్ అలీ,మేడ్చల్‌కు చెందిన అనిల్ తో పాటు మరో ఐదుగురు కలిసి జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్‌ను ఎత్తుకెళ్లేవారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘావేసి ఐదుగురిని శనివారం ఇందల్వాయి వద్ద పట్టుకొని అరెస్టు చేశామన్నారు. కాపర్ కాయిల్స్ కొనుగోలు చేసిన ముగ్గురిని సైతం అరెస్టు చేసినట్లు తెలిపారు. 101 ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి 40 కిలోల కాపర్ కాయిల్స్‌ను దొంగిలించారన్నారు.


