పులుమద్దిలో విదేశీ బృందం
అనంతగిరి: మండలంలోని పులుమద్దిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అధ్యయనం చేసేందుకు శుక్రవారం ఈజిప్ట్, ఘనా, మెరినా, ఓమన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా తదితర పది దేశాల ప్రతినిధుల బృందం పర్యటించింది. ఎన్‌ఐఆర్‌డీ శిక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వీరు ఆరు రోజుల పాటు పర్యటించనున్నారు. డీఆర్‌డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ వినయ్ కుమార్ విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికారు. పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, వాటర్ షెడ్‌ను పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంఘాలకు అందజేస్తున్న ప్రోత్సాహకాలు, సున్నా వడ్డీ రుణాలు తదితర అంశాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీఓ దయానంద్, కార్యదర్శి శిల్ప, ఏపీఎం శ్రీనివాస్, ఈసీ నవీన్, ఆనంద్, మహిళా సమాఖ్య, ఉపాధి హామీ సంఘాల అధికారులు పాల్గొన్నారు.


