కష్టపడి పనిచేస్తే భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

కష్టపడి పనిచేస్తే భవిష్యత్‌

Nov 12 2025 9:45 AM | Updated on Nov 12 2025 9:45 AM

కష్టపడి పనిచేస్తే భవిష్యత్‌

కష్టపడి పనిచేస్తే భవిష్యత్‌

అనంతగిరి: కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేసిన ప్రతీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం వికారాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సోషల్‌ మీడియా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సోషల్‌ మీడియా కార్యద ర్శి చామల రఘుపతిరెడ్డి, స్పోక్స్‌ పర్సన్‌ గౌరీసతీష్‌ , యూత్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ జనరల్‌ సెక్రెటరీ సంతోష్‌ కుమార్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, వికారాబాద్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ చాపల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement