పని చేసినా.. ఫలితం సున్నా!
కుల్కచర్ల: సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాల ఫలితాలు అందాలనే సంకల్పంతో.. రాష్ట్రంలో ఏ కులం ఎంత శాతం ఉన్నారో తేల్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కులగణన సర్వేను చేపట్టింది. ఉపాధ్యాయులు సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయిచేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటుగా ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకుని వారితో డేటా ఎంట్రీ చేయించారు.
జిల్లా వ్యాప్తంగా పెండింగ్
వికారాబాద్ జిల్లాలో 18 మండల పరిషత్‌లు, నాలుగు మున్సిపాలిటీల్లో కుటుంబ సర్వే చేపట్టి 2,43,487 కుటుంబాల వివరాలను ఆన్‌లైన్ చేశా రు. ఇక్కడ ఒక్కో దరఖాస్తుకు ప్రభుత్వ సిబ్బంది రూ.15, ప్రైవేట్ ఆపరేటర్లకు రూ.30గా నిర్ణయించారు. ఈ మేరకు రూ.73,04,610 చెల్లించాల్సి ఉంది.
రూ.3.58 లక్షల బకాయి
కుల్కచర్ల మండల పరిషత్‌లో 44 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 11,942 కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేశారు. ఇద్దరు ప్రభుత్వ సిబ్బందితో పార్టు తాత్కాలికంగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి డేటా ఎంట్రీ చేశారు. ఇందుకు వారికి ఒక్కో ఫాం కంప్యూటరీకరించిందనకు గాను రూ.30 ఇవ్వాలని నిర్ణయించారు. 11,942 కుటుంబాలకు గాను ఆపరేటర్లకు రూ.3,58,260 ఇవ్వాల్సి ఉంది. ఏడాది దాటినా ఆపరేటర్లకు డబ్బులు అందక ఇబ్బంది పడుతున్నారు.
కులగణన సర్వే వివరాల ఆన్‌లైన్ ఎంట్రీ పూర్తి
ఏడాది గడిచినా అందని బిల్లులు
ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఆపరేటర్లు


