ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

Nov 12 2025 9:45 AM | Updated on Nov 12 2025 9:45 AM

ధాన్య

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

దుద్యాల్‌: ‘కొనుగోలు పరేషాన్‌’ శీర్షికతో మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. దుద్యాల్‌ రైతు వేదికతో పాటు లగచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 111 దొడ్డు రకం ధాన్యం సేకరణ సెంటర్లు, 18 సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ కొనుగోళ్లు సాగుతాయని, దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని తరలించామని స్పష్టంచేశారు. లగచర్ల, దుద్యాల్‌లో నిర్వహించిన కొనుగోలు కేంద్రాల ప్రారంభ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్‌, మెట్లకుంట పీఏసీఎస్‌ చైర్మన్‌ జయకృష్ణ, కొడంగల్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆకారం వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య, తహసీల్దార్‌ కిషన్‌, ఏఈవోలు భావన, మాణికేశ్వరి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ఖాలీల్‌ పాషా, మాజీ మర్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకట్రాములు గౌడ్‌, నాయకులు కృష్ణ, లక్ష్యయ్య, శ్రీశైలం, సత్యనారాయణ, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

దుద్యాల్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న నాయకులు

లగచర్లలో..

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం1
1/2

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం2
2/2

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement