ఇరువర్గాల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

ఇరువర్గాల ఘర్షణ

Nov 12 2025 9:45 AM | Updated on Nov 12 2025 9:45 AM

ఇరువర

ఇరువర్గాల ఘర్షణ

దోమ: హార్వెస్టర్‌ త రలింపు విషయంలో జరిగిన గొడవలో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం మండల పరిధిలోని గొట్కచెల్కతండాకు చెందిన ఆంగోత్‌ సురేశ్‌ సోమవారం తన వరి పంటను కోసేందుకు పొలానికి హార్వెస్టర్‌ తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో ఇదే తండాకు చెందిన అంగోత్‌ గోబ్రీబాయి తమ ఇంటి ముందు నుంచి హార్వెస్టర్‌ తీసుకెళ్లకుండా కోడలు అరుణతో కలిసి అడ్డుకుంది. దీంతో సురేశ్‌ తండ్రి గేమ్యా వారితో వాగ్వాదానికి దిగి, దాడి చేశాడు. విషయం తెలుసుకున్న గోబ్రీబాయి కుమారుడు రవి వచ్చి సురేశ్‌తో పాటు గేమ్యాపై దాడికి పాల్పడ్డాడు. గొడవ పెరగడంతో ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మందపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వసంత్‌జాదవ్‌ తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

తొమ్మిది మందిపై కేసు

ఇరువర్గాల ఘర్షణ 1
1/1

ఇరువర్గాల ఘర్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement