మెథడిస్ట్ జాతర ప్రారంభం
నాణ్యత తప్పనిసరి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని మండల వైద్యాధికారి కిరణ్‌గౌడ్ అన్నారు.
ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్ రీజినల్ కాన్ఫరెన్స్ బిషప్ ఎ.సీమొన్
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మెథడిస్టు క్రిస్టియన్ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. వారం రోజుల పాటు కొనసాగనున్న వేడుకలను హైదరాబాద్ రీజినల్ కాన్ఫరెన్స్ బిషప్ ఎ.సీమొన్ ప్రారంభించారు. జాతర కార్యదర్శి స్టీవెన్‌తో కలిసి ప్రధాన ముఖద్వారం వద్ద రిబ్బన్ కత్తిరించారు. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన క్రీస్తు శిలువ వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రభువు కీర్తనలు ఆలపిస్తూ శిలువ వద్దకు చేరుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యుడు రెవరెన్ డి.మార్క్ తదితరులు వీరికి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో బిషప్ మాట్లాడారు. 1922లో మొదలైన ఈ వేడుక ఈసారి 103 వసంతాలకు చేరిందన్నారు. జాతరకు వచ్చే యాత్రికులకు ఏసుక్రిస్తు ప్రబోధనలను వినిపించి, వారిలో ఏసు పట్ల భక్తి, నమ్మకం కలిగించాలని సూచించారు. ఏసుక్రీస్తును మనసారా, నమ్మి ప్రార్థిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బెంగళూర్ రీజియన్ జాతర కార్యదర్శి పాల్‌మధుకర్, కోశాధికారి రవి సెబాస్టియన్, విజయకుమార్, కాన్ఫరెన్స్ లేలీడర్లు, కోశాధికారులు, పాస్టర్లు పాల్గొన్నారు. ఎస్పీ నారాయణరెడ్డి జాతర ప్రాంగణాన్ని సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


