దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Nov 12 2025 9:41 AM | Updated on Nov 12 2025 9:41 AM

దరఖాస

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలి కోడెల వేలం జాతీయస్థాయి పోటీలకు కుల్కచర్ల విద్యార్థి

పూడూరు: మండలంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ సరళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్కేపల్లి మోడల్‌ స్కూల్‌లో 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు బోధన చేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ లోపు స్కూల్‌లో నేరుగా సంప్రదించాలని కోరారు. మరింత సమాచారం కోసం సెల్‌ నంబర్‌ 8501069358లో సంప్రదించాలని సూచించారు.

ఎస్పీ నారాయణరెడ్డి

అనంతగిరి: ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే మీ దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌ లేదా డయల్‌ 100కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌ పట్టణంలోని రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ తదితర ప్రాంతాల్లో విస్త్రృతంగా తనిఖీలు చేసినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సకరించాలని కోరారు.

రూ.2.23 లక్షల ఆదాయం

అనంతగిరి: అనంతగిరి అనంతపద్మనాభ స్వామికి కార్తీక మాసం పెద్ద జాతరను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన కోడెలకు మంగళవారం ఆలయ వద్ద బహిరంగ వేలం నిర్వహించారు. కోడెలను విక్రయించడం ద్వారా ఆలయానికి రూ.2.23 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో నరేందర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ చైర్మన్‌ పద్మనాభం, పలువురు భక్తులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: మండలంలోని హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కుల్కచర్లకు చెందిన పార్థసారధి జాతీయస్థాయి ఫెన్సింగ్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 6, 7వ తేదీల్లో హకీంపేట్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌లో రాష్ట్రస్థాయి అండర్‌ –17 పోటీలు నిర్వహించగా పార్థసారధి చక్కటి ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే పోటీల్లో పాల్గొనున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం 1
1/1

దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement