బీసీ సమస్యలపై సమష్టిగా పోరాడుదాం | - | Sakshi
Sakshi News home page

బీసీ సమస్యలపై సమష్టిగా పోరాడుదాం

Nov 12 2025 9:41 AM | Updated on Nov 12 2025 9:41 AM

బీసీ సమస్యలపై  సమష్టిగా పోరాడుదాం

బీసీ సమస్యలపై సమష్టిగా పోరాడుదాం

బీసీ సమస్యలపై సమష్టిగా పోరాడుదాం కవితకు ఘన స్వాగతం

బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ

షాద్‌నగర్‌: బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమష్టిగా పోరాటం చేయాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ పిలుపునిచ్చారు. బీసీ సేన జిల్లా అధ్యక్షుడు సదర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన మంగళవారం పట్టణంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బర్క కృష్ణ మాట్లాడుతూ.. సంఘంలోని సభ్యులంతా కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలని సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని అన్నారు. ఈ సందర్భంగా సంఘం నూతన కోర్‌ కమిటీ సభ్యులుగా సదర్‌ శ్రీనివాస్‌, మచ్చ పోతుల వరప్రసాద్‌, ప్యాట జయ, భూషం నరేష్‌, చీపిరి చంద్రశేఖర్‌, చెన్న బాల్‌రాజ్‌ ఎంపికయ్యారు. నూతన సభ్యులకు బర్క కృష్ణ నియామక పత్రాలు అందజేశారు.

యాచారం: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం నల్లగొండ జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆమెను నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై మాల్‌ గ్రామంలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత అక్కడే ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement