సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ
అనంతగిరి: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా పి.రామకృష్ణ ఎన్నికయ్యారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా చంద్రయ్య, జిల్లా ఉపాధ్యక్షులుగా మైపాల్, నర్సమ్మ, సహాయ కార్యదర్శిగా మంగమ్మ, శరణప్ప తోపాటు 18 మందితో కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్స్, ఆశ వర్కర్స్, జీపీ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, భవన నిర్మాణ రంగం కార్మికులు, హాస్టల్ వర్కర్స్ ఎలక్ట్రిసిటీ ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు.


