జాతీయ స్థాయిలో చిన్నారికి ప్రథమ బహుమతి | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయిలో చిన్నారికి ప్రథమ బహుమతి

Nov 9 2025 9:18 AM | Updated on Nov 9 2025 9:18 AM

జాతీయ

జాతీయ స్థాయిలో చిన్నారికి ప్రథమ బహుమతి

తాండూరు: జాతీయ స్థాయి సాంస్కృతిక పైథియన్‌ క్రీడల్లో తాండూరు విద్యార్థిని ప్రథమ బహుమతి సాధించింది. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న మోక్షా మిరన్‌.. బెంగళూరులో జరిగిన 2వ జాతీయ సాంస్కృతిక పైథియన్‌ పోటీల్లో ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్‌ ఇందూర్‌ రాములు, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.

కుటుంబసభ్యుల చెంతకు

మతిస్థిమితం లేని మహిళ

మొయినాబాద్‌రూరల్‌: మతిస్థిమితం లేని మహిళలను పోలీసులు కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. వివరాలివీ.. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెడ్డిపల్లిలో మతిస్థిమితం లేకుండా ఓ మహిళ తిరుగుతుండగా పెట్రోలింగ్‌ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆమె వద్ద లభించిన ఓ పాకెట్‌ డైరీలో ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమెను మోమిన్‌పేట్‌ గ్రామానికి చెందిన వడ్ల శ్రీదేవి (45)గా గుర్తించారు. సమాచారం అందుకున్న ఆమె కుమారుడు శనివారం పోలీస్‌స్టేషన్‌కు రాగా పోలీసులు అతనికి అప్పగించారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

యాచారం: విద్యుత్‌ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌గౌడ్‌ (42) యాచారం మండలం మాల్‌లోని సాగర్‌ రోడ్డు పక్కన ఇంటి నిర్మాణం చేపట్టాడు. శనివారం పనులను పరిశీలిస్తుండగా గోడలకు సమీపంలో ఉన్న విద్యుత్‌ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదకరంగా ఉన్న వైర్లను తొలగించాలని పలుమార్లు ఆశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు సాగర్‌ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మధు తెలిపారు.

సిటీకి చెత్త సమస్యలు

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెత్త సమస్యలు తీవ్రం కానున్నాయా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నగరంలోని చెత్తతోపాటు , శివారు మునిసిపాలిటీల చెత్తనూ జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకే తరలిస్తున్నారు. జవహర్‌ నగర్‌ సమస్యపై కొందరు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కు వెళ్లడంతో జవహర్‌నగర్‌కు చెత్త తరలింపు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ అంశంపై సోమవారం ఫైనల్‌ హియరింగ్‌ జరగనున్నట్లు సమాచారం. నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌ వెలువరించే ఆదేశాల కనుగుణంగా నగరంలో చర్యలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో శివారు మునిసిపాలిటీలు చెత్తను జవహర్‌నగర్‌కు తరలించవద్దని ఉన్నతాధికారులు సూచించారు.

జాతీయ స్థాయిలో  చిన్నారికి ప్రథమ బహుమతి 1
1/2

జాతీయ స్థాయిలో చిన్నారికి ప్రథమ బహుమతి

జాతీయ స్థాయిలో  చిన్నారికి ప్రథమ బహుమతి 2
2/2

జాతీయ స్థాయిలో చిన్నారికి ప్రథమ బహుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement