సాగర తీరంలో సీఎం సైకత చిత్రం
ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో మొదటిసారిగా శాండ్ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ నేతృత్వంలో తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డి, తెలంగాణ తల్లి, విజయారెడ్డి చిత్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై కేక్ కట్ చేశారు. ‘హైదరాబాద్‌లో బీచ్ లేని లోటును భర్తీ చేస్తూ, టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచనలకు మద్దతు ఇస్తూ ఈ చిత్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఆర్ట్ ఉంటుంది’అని విజయారెడ్డి తెలిపారు.
– ఖైరతాబాద్


