ట్రాఫిక్ తంటాలు
తాండూరు: పట్టణంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించే పోలీసులు లేకపోవడంతో వాహనాలు భారీగా సంఖ్యలో ఆగిపోయాయి. మండల కార్యాలయాలకు, రస్నం వైపునకు వెళ్లాలంటే బ్రిడ్జి దిగిన వెంటనే వాహనాలను టర్నింగ్ చేసుకోవాలి. ఈ క్రమంలో కొంత ఆలస్యం జరుగుతోంది. దీంతో తాండూరు పట్టణం నుంచి వచ్చే వాహనాలు, కొడంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. శుక్రవారం కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. తాండూరుకు చెందిన 108 అంబులెన్స్ వాహనం కొడంగల్ రోడ్డు మార్గం వైపు వెళ్లూ ఆగిపోయింది. స్థానికులు దాన్ని పక్కకు తోశారు. ఆ సమయంలో వాహనంలో ఎవరూ లేకపోవడంతో ఊపరి పీల్చుకున్నారు. ఇప్పటికై నా అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


