బైక్‌కు నిప్పంటించిన దుండగులు
మోమిన్‌పేట: గుర్తు తెలియని వ్యక్తులు ఓ బైకుకు నిప్పుపెట్టగా.. మరో ఘటనలో కొట్టంలో పార్కు చేసిన ద్విచక్ర వాహనాన్ని బావిలో పడేశారు. ఈ సంఘటనలు ఆదివారం రాత్రి చోటు చేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన ఏన్కతల మల్లేశం.. రోజులాగే తన బైక్‌ను ఇంటి ముందు పార్కు చేశారు. రాత్రి వేళలో.. ఎవరో ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. పెద్దగా మంటలు రావడంతో బయటకు వచ్చి చూడగా.. వాహనం పూర్తిగా కాలిపోయింది.
బావిలో పడేశారు!
ఇదే గ్రామంలో రంగారెడ్డి గారి వెంకట్‌రెడ్డి.. తన బైక్‌ను వ్యవసాయ బావి వద్ద రెండు రోజుల క్రితం పశువుల కొట్టంలో పెట్టాడు. తిరిగి తెల్లవారు జామున వెళ్లి చూడగా బైక్ కన్పించ లేదు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. బావిలో పడేసినట్లుగా ఆనవాళ్లు ఉండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.


