పరిమితికి మించితే కేసులు తప్పవు
మోమిన్‌పేట: అనుమతికి మించి అధికంగా సరకు రవాణా చేసే లారీలపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ అరవింద్ హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మట్టి, ఇసుక, కంకర తదితర వాటిని రవాణా చేసే లారీలు.. పరిమితికి మించి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడపరాదన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండాలని చెప్పారు. నంబరు లేని వాహనం రోడ్డు ఎక్కరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బలరాం, వెంకటయ్య ఉన్నారు.


