సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సత్వరం పరిష్కరించాలి

Nov 4 2025 8:11 AM | Updated on Nov 4 2025 8:11 AM

సత్వర

సత్వరం పరిష్కరించాలి

అనంతగిరి: ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 86 ఫిర్యాదులు వచ్చాయి. ప్రాధాన్యత క్రమంగా పరిష్కరించాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు లింగ్యానాయక్‌, సుధీర్‌, ఆర్డీఓ వాసుచంద్ర, డీఆర్‌ఓ మంగ్లీలాల్‌ పాల్గొన్నారు.

సర్టిఫికెట్ల అందజేత

అనంతగిరి: డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబ సభ్యులకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ కింద గత నెల 27 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు సెంట్రింగ్‌ వర్క్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వీరందరికీ సోమవారం కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ సర్టిఫికెట్స్‌ అందజేశారు. కార్యక్రమంలో డీపీయం కొమురయ్య, డీఈలు, ఏపీయంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

చెక్కుల పంపిణీ

అనంతగిరి: కొడంగల్‌ మహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న 14 మందికి సోమవారం కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ తన కార్యాలయంలో చెక్కులు అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బలరాం నాయక్‌, తహసీల్దార్‌ రాంబాబు పాల్గొన్నారు.

ఘనంగా తులసి కల్యాణం

అనంతగిరి: వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరిగుట్ట అనంతపద్మనాభ స్వామి ఆలయ కార్తీక మాస జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ఆలయంలో తులసి కల్యా ణం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ పద్మనాభం, ప్రధాన అర్చకుడు శేషగిరి శర్మ, భక్తులు పాల్గొన్నారు.

నిర్వాసితుల అభిప్రాయ సేకరణ

కొడంగల్‌: అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి గాంధీనగర్‌ వరకు రోడ్డు విస్తరణలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారితో సోమవారం.. రెవెన్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌, అధికారులు నిర్వాసితుల అభిప్రాయాలు సేకరించారు. జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. అనంతరం నిర్వాసితులు మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణలో భాగంగా నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చి వేశారని ఆరోపించారు. తగిన పరిహారం చెల్లించి, న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ బలరాం నాయక్‌, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఇంజినీర్‌ సుదర్శన్‌, పట్టణ వాసులు పాల్గొన్నారు.

పారిశ్రామిక వాడకు.. మరో 55.36 ఎకరాలు

నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం

దుద్యాల్‌: హకీంపేట్‌, పోలేపల్లి, లగచర్ల గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక వాడకు మరో 55.36 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలో 1,270 ఎకరాలను సేకరించిన విషయం తెలిసిందే. హకీంపేట్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ఆనుకుని ఉన్న 195 నుంచి 205 సర్వే నంబర్‌ వరకు 39 మంది రైతులకు చెందిన 32.21 ఎకరాల పట్టా భూమి, పోలేపల్లి పరిధి 815 నుంచి 817 వరకు 32 మంది రైతులకు చెందిన 23.15 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు తాజాగా సర్కారు నోటిఫికేషన్‌ జారీ చేసింది. సంబంధిత ప్రొసీడిగ్స్‌ విడుదలయ్యాయి. అధికారికంగా నేడు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. హకీంపేట్‌లో సేకరించనున్న భూమిలో పోలీస్‌ స్టేషన్‌తో పాటు తదితర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విస్వసనీయ సమాచారం.

సత్వరం పరిష్కరించాలి 1
1/3

సత్వరం పరిష్కరించాలి

సత్వరం పరిష్కరించాలి 2
2/3

సత్వరం పరిష్కరించాలి

సత్వరం పరిష్కరించాలి 3
3/3

సత్వరం పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement