శోకసంద్రంలో పేర్కంపల్లి
యాలాల: ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందడంతో వారి స్వగ్రామం పేర్కంపల్లి శోక సంద్రంలో మునిగిపోయింది. పేర్కంపల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ కుటుంబం కొన్నేళ్ల క్రితం తాండూరుకు వెళ్లి ిస్థిరపడింది. వారికి గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. గ్రామానికి తరచూ వచ్చి వెళ్తుంటారు. కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకు ఊరు విడిచి మృతదేహాలతో గ్రామానికి వచ్చావా అంటూ ఎల్లయ్యగౌడ్‌ను చూసిన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గురి అంత్యక్రియలు సాయంత్రం నిర్వహించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
