
స్నానానికి వెళ్లి.. నీట మునిగి
బొంరాస్‌పేట: వివాహ వేడుకకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బురాన్‌పూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గత ఆదివారం గ్రామానికి చెందిన అర్షద్‌పాషా పెళ్లి జరిగింది. గోల్కొండలో ప్లంబింగ్ పని చేసే నాసిరొద్దీన్(41) తన భార్యాపిల్లతో కలిసి సోమవారం నిర్వహించిన వలీమా ఫంక్షన్‌కు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం పెళ్లి కొడుకుతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి నాసిరొద్దీన్ గ్రామ శివారులోని పెద్ద వాగు ప్రాజెక్టులో స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలవెంకటరమణ తెలిపారు.
పెళ్లికి వచ్చిన వ్యక్తి మృత్యువాత