
రేపు కొడంగల్ బంద్
కొడంగల్: కొడంగల్‌కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను లగచర్లకు తరలిస్తున్నారని నిరసిస్తూ గురువారం కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ బంద్‌కు పిలుపు నిచ్చారు. దీనికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కేడీపీ జేఏసీ కన్వీనర్ కొట్రికె లక్ష్మీనారాయణ గుప్తా, కో కన్వీనర్లు గంటి సురేశ్, ఎరన్‌పల్లి శ్రీనివాస్, పవన్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను, గురుకులాలను కొడంగల్ శివారులోనే నిర్మించాలని వారు కోరారు.
గోదాం నిర్మాణానికి భూమి కేటాయింపు
దుద్యాల్: మండల కేంద్రంలో గోదాం ఏర్పాటుకు పదెకరాల ప్రభుత్వ భూమిని తహసీల్దార్ కిషన్ మంగళవారం కేటాయించారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ వేణుగోపాల్, మేనేజర్ విజయ్ కుమార్‌తో కలిసి కృష్ణగిరి దేవాలయ సమీపంలోని సర్వే నంబర్ 191లో పదెకరాలు గుర్తించి హద్దులు నిర్ధారించారు. అనంతరం అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్ కుమార్, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది నర్సిములు, గిడ్డంగుల కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది మహేశ్ కుమార్, కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకారం వేణుగోపాల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు వెంకటయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ ఖలీల్ పాషా, నాయకులు శ్రీశైలం గౌడ్, ఖాజా, సత్యనారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
కుల్కచర్ల: పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికి ఖచ్చితంగా పదవులు లభిస్తాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కుల్కచర్ల మండల కేంద్రంలో డీసీసీ ఎన్నికకు ఏఐసీసీ ఇన్‌చార్జి సూరజ్‌సింగ్ ఠాగూర్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల పార్టీయని, పార్టీ అభ్యున్నతికి కృషిచేసేవారికే గుర్తింపు లభిస్తుందన్నారు.
కల్యాణం కమనీయం
వైభవంగా లక్ష్మినరసింహాస్వామి వార్షికోత్సవం
పరిగి: పట్టణ కేంద్రంలోని లక్ష్మినరసింహాస్వామి వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు పలు గ్రామాల నుంచి భక్తులు అఽధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం స్వామి వారి కల్యాణాన్ని వేద పండితులు కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామి వారికి లక్ష్మిసమేతంగా పట్టణ కేంద్రంలోని పుర వీధుల గుండ పల్లకీ సేవా నిర్వహించారు.

రేపు కొడంగల్ బంద్

రేపు కొడంగల్ బంద్