
మహిళా సంఘాలను బలోపేతం చేయాలి
తాండూరు రూరల్: జిల్లాలో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని అడిషనల్ డీఆర్‌డీఓ నర్సిములు పేర్కొన్నారు. మంగళవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా మండలాల ఐకేపీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిములు మాట్లాడుతూ.. ఏపీఏంలు, సీసీలు గ్రామాల్లో ఎప్పటికప్పుడు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించాలన్నారు. ఆయా మండలాలకు ఇచ్చిన బ్యాంక్ లింకేజీ రుణాల టార్గెట్‌ను పూర్తి చేయాలని సూచించారు. సీ్త్రనిధి రుణాలకు సంబంధించి గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల్లో మొండి బకాయిలను త్వరగా కట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఏంలు శేఖర్, నర్సిములు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకీ, ఆయా మండలాల ఏపీఏం, సీసీలు పాల్గొన్నారు.
అడిషనల్ డీఆర్‌డీఓ నర్సిములు