
మార్కెట్ సౌకర్యం కల్పించండి
గతంలో మేము పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేసేవాళ్లం. వరుసగా నష్టాలే రావడంతో పూలు, కూరగాయలు సాగు చేస్తున్నాం. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో సమీప పట్టణాలు, హైదరాబాద్‌కు తరలించి, విక్రయిస్తున్నాం. అధికారులు మార్కెట్ సౌకర్యం కల్పిస్తే మేలు జరుగుతుంది.
– బంటు పార్వతమ్మ, బొంపల్లి
ఎకరం భూమిలో సాగు చేశాం
వాణిజ్య పంటలతో నష్టాలు రావడంతో బంతి పూలు సాగు చేశాం. ఎకరం భూమిలో పసు పు, ఎరుపు రంగు బంతి సాగు చేశాం. ఎకరానికి రూ.30 వేలు ఖర్చు వచ్చింది. పెట్టుబడి పోనూ రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాం. తోట వద్దే పూలు విక్రయిస్తున్నాం.
– ఎల్.కిష్టమ్మ, మల్లేపల్లి

మార్కెట్ సౌకర్యం కల్పించండి