
‘ఇంటి పర్మిషన్‌కు డబ్బులు డిమాండ్’
దోమ: ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వమని పంచాయతీ కార్యదర్శి వద్దకు వెళ్తే రూ.6 వేలు డిమాండ్ చేస్తున్నారని రాకొండకు చెందిన పిల్లి శ్యామలమ్మ ఆరోపించారు. ఇదే విషయాన్ని తాను కొద్ది రోజుల క్రితం ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశానని, అయినా సెక్రటరీ వ్యవహారం మారలేదని తెలిపారు. 40 గజాల స్థలంలో తాను నిర్మించుకుంటున్న ఇంటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.2 వేలు అవుతుందని, కానీ రూ.6 వేలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి అనుమతి ఇప్పించాలని లేదంటే, మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తానని హెచ్చరించారు. ఈ విషయమై ఎంపీడీఓ గ్యామాను వివరణ కోరగా, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.