
కుండపోత.. గుండెకోత
ఎకరాకు రూ.25 వేలు
తాండూరు రూరల్: భారీ వర్షాల కారణంగా సోయాబీన్ సాగు చేసిన రైతులు ఆందోళనచెందుతున్నారు. పంట నష్టపోయి దిగాలుచెందుతున్నారు. తాండూరు మండలం ఐనెల్లి, కోటబాసుపల్లి, మిట్టబాసుపల్లి, జినుగుర్తి గ్రామాల్లో 600 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు. ఈ సాగు.. మధ్యప్రదేశ్ తరువాత తెలంగాణలోని నిజామాబాద్, కరీనంగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మెదక్‌లోవిస్తృతంగా సాగవుతోంది. మండల పరిధిఐనెల్లి గ్రామానికి చెందిన రైతు మాధవరెడ్డి తొలిసారిగా 1996లో తన సాగుభూమిలో సోయాబీన్ సాగు చేశారు. దానిని చూసినఆ గ్రామ రైతులు చాలామంది ఈ పంట సాగుకు మక్కువ చూపారు.
తగ్గిన దిగుబడి
సోయాబీన్ గతంలో ఎకరాకు దాదాపు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా 5 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇంకా 20 శాతం పొలాల్లో పంట ఉందని, వాన కారణంగా కోత యంత్రం పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గింజ నల్లగా మారడంతో మార్కెట్లో సరైన మద్దతు ధర దొరకడం లేదని పేర్కొంటున్నారు. మార్కెట్లో మద్దతు ధర రూ.5,328 ఉందని, కానీ తాండూరు వ్యవసాయ మార్కె ట్లో మాత్రం ప్రస్తుతం ఽక్వింటాకు రూ.4,100లకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. ఇలా అయితే పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టులో కురిసిన వర్షాలతో చాలా పంటలు దెబ్బతిన్నాయి. వాటి వివరాలను సేకరించాము. అందులో సోయాబీన్ ఉన్నట్లు గుర్తించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెప్టెంబర్‌లో నష్టపోయిన పంటల వివరాలను తెలుసుకుంటున్నాము. సోయాబీన్ నష్టంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– కొమురయ్య, ఏడీఏ, తాండూరు డివిజన్
12 ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశాను. గతంలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. వర్షాల కారణంగా ప్రస్తుతం 6 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. గింజలు నల్లగా మారాయి. మద్దతు ధర కరువైంది. ఈ ఏడు పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– మాధవరెడ్డి, రైతు, ఐనెల్లి
అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు
సోయాబీన్‌పై అధిక ప్రభావం
తగ్గిన దిగుబడి.. నల్లబడిన గింజ
సన్నగిల్లిన మద్దతు ధర
అతివృష్టి అనావృష్టి అంటారు. ఈ ఏడు అదే జరిగింది. కాలం కొంత ఆలస్యంగా అయినా.. బాగా అయిందని రైతన్నలు మురిసిపోయారు. ఆ మురిపెం ఎన్నోరోజులు ఉండలేదు. కుండపోత వర్షాలతో పత్తి, సోయాబీన్, వరి తదితర పంటలకు తీవ్రనష్టం కలిగించి, అన్నదాతలకుగుండెకోత మిగిల్చింది.
సోయాబీన్ సాగు ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి అవుతుందని రైతులు తెలిపారు. ఎకరాకు 30 కిలోల విత్తనాలు అవసరమని, వాటికి రూ.3,200 ధర ఉందని చెప్పారు. జూన్ రెండో వారంలో ప్రారంభించి, సెప్టెంబర్ నెల ఆఖరు వరకు పంట చేతికి వస్తోందని పేర్కొంటున్నారు. విత్తనాలు, కలుపు, ఎరువులు, కోత మిషన్ అన్నీ కలుపుకొని ఎకరాకు పైన పేర్కొన్న ఖర్చు అవుతుందంటున్నారు.

కుండపోత.. గుండెకోత

కుండపోత.. గుండెకోత