
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
యాలాల: కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు రాత్రివేళ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కాగ్నా నదిలో ఉన్న ట్రాక్టరును పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. వాహనానికి నంబరు లేకపోవడంతో పాటు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పట్టుబడిన ట్రాక్టరు అగ్గనూరు గ్రామానికి చెందినదిగా గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.