
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
తాండూరు: రైతులకు ఇబ్బంది లేకుండా వరి, పత్తి కొనుగోలు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కోరారు. సోమవారం వికారాబాద్‌లో కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కలిసి ఈ మేరకు విన్నవించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అనుమతులు జారీ చేసేలా తహసీల్దార్లను ఆదేశించాలన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూంలు, సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బైపాస్ రోడ్డుకు మోక్షం
తాండూరు: తాండూరు బైపాస్ రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. నిర్వాసితులకు నాన్ అగ్రికల్చర్ భూమి గజానికి రూ.6 వేలు, వ్యవసాయ భూమి ఎకరాకు రూ.21 లక్షలు ఇస్తా మని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ రూ.25.13 కోట్లు కేటాయించారు. దీంతో బైపాస్ రోడ్డు పనులకు అడ్డంకులు తొలిగినట్లయింది.
బీసీ రిజర్వేషన్ల సాధనకు కలిసి నడుద్దాం
తాండూరు టౌన్: రిజర్వేషన్ల సాధనకు కలిసి నడుద్దామని బీసీ సంఘాల నాయకులు కందుకూరి రాజ్‌కుమార్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం ఇచ్చిన బంద్‌ను విజయవంతం చేయుడంలో భాగంగా ఈ నెల 15న తాండూరులో అఖిలపక్ష పార్టీలతో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్‌లో ఉదయం 10గంటలకు అఖిలపక్ష పా ర్టీల బీసీ సంఘాలు, బీసీ మేధావులు, అన్నికుల సంఘాలు,ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకు లు హాజరు కావాలని కోరారు. హైకోర్టు స్టే నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన విషయం విధితమే. ఇట్టి బంద్‌ను విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
రైతుల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: రైతుల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప రిగి, దోమ, పూడూరు మండలాలకు చెందిన రైతులకు ఉచితంగా వేరుశనగ,శనగ విత్తనాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో రైతులను విస్మరించిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏడీఏ డీఎస్ లక్ష్మీకుమారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాట్‌పుట్‌లో
సాయికిరణ్‌కు స్వర్ణం
దుద్యాల్: వికాబాద్ జిల్లా దుద్యాల మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన అల్వాల్ సాయికిరణ్ జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకం సాధించారు. భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న అండర్– 20 జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో సోమవారం ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈపోటీల్లో తెలంగాణ తరఫున షాట్‌పుట్‌లో పాల్గొన్న సాయికిరణ్ నంబర్‌వన్‌గా నిలిచారు.
నేడు సెర్ప్ అధికారుల సమావేశం
తాండూరు రూరల్: తాండూరు డివిజన్‌కు సంబంఽధించి సెర్ప్ అధికారుల సమావేశానికి మంగళవారం డీఆర్‌డీఏ శ్రీనివాస్ రానున్నట్లు మండల ఐకేపీ, ఏపీఏం బాలయ్య సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10:30 నిమిషాలకు మహిళా సమాఖ్యపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల, దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట్ మండలాల ఐకేపీ ఏపీఏం, సీసీలు తదితరులు హాజరుకావాలని కోరారు.

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి