
అక్రమ కట్టడాలు తొలగించండి
కొత్తూరు: పాత మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో ప్రభుత్వ పాఠశాల గేటుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని స్థానికులు సోమవారం కమిషనర్ బాలాజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్యాలయానికి వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉందన్నారు. దానికి తోడు చిరు వ్యాపారులు ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇదే అదునుగా కొందరు రోడ్డుకు ఇరువైపులా డబ్బాలు, అక్ర మ కట్టడాలు నిర్మించడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. మున్సిపాలిటీ అధికారులు అక్ర మంగా వెలసిన కట్టడాలను తొలగించిన తర్వాత రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరారు. లేని పక్షంలో ధర్నాలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రావణ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, కుమార్, నర్సింహ, సురేందర్, రాజు పాల్గొన్నారు.