నిరుపేదలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు అండగా ఉంటాం

Oct 14 2025 8:53 AM | Updated on Oct 14 2025 8:53 AM

నిరుప

నిరుపేదలకు అండగా ఉంటాం

కుల్కచర్ల: నిరుపేద ప్రజలకు అండగా ఉంటామని పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని ఘణపూర్‌ గ్రామానికి చెందిన గజ్జి వెంకటయ్య ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. కాగా విషయం తెలుసుకున్న ఆయన సోమవారం స్థానిక నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. వెంకటయ్య పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఖర్చులు భరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానికులు రాములు, చెన్నయ్య, బాలయ్య, మాస య్య, బాలచందర్‌, కేశవులు పాల్గొన్నారు.

సీజేఐపై దాడికి యత్నించిన వారిని శిక్షించాలి

ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌

అనంతగిరి: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌పై దాడి యత్నం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని ఎంఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం వికారాబాద్‌ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ధర్నా చేపట్టి కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రశాంత్‌, మల్లికార్జున్‌, సుభాన్‌, అంజి, భరత్‌కుమార్‌, పుష్పరాణి, మంజుల, పద్మమ్మ, సునీత పాల్గొన్నారు.

అయోధ్యలో ప్రదర్శనకు

మన కళాకారులు

బొంరాస్‌పేట: శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో జరిగే ‘దినోత్సవం 2025’ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే జానపద కళాబృందంలో జిల్లా కళాకారులకు స్థానం దక్కింది. 28 రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ కళ ప్రదర్శనలకు కొడంగల్‌కు చెందిన ప్రకాశ్‌ మాస్టర్‌ బృందానికి అవకాశం దక్కినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే ఉత్సవాల్లో 15 మంది కళా బృందం సభ్యులు తెలంగాణ బోనాల ప్రదర్శన చేయనున్నట్లు చెప్పారు. కళాబృందంలో కళాకారుల సంఘం నాయకులు కృష్ణయ్య, అంజిలప్ప, రమేష్‌, పెంటప్ప, చిన్ని మనీషా తదితరులున్నారని మాస్టర్‌ ప్రకటించారు.

వేటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం

యాలాల: వేటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని అన్నసాగర్‌ గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన గురుదొట్ల శేఖర్‌ బాణాపూర్‌ గ్రామాని కి చెందిన సునీల్‌తో కలిసి ఈ నెల 9వ తేదీ రాత్రి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లారు. నాటి నుంచి శేఖర్‌ తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన భార్య కవిత సోమవారం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.

హత్య కేసులో

నిందితురాలి అరెస్టు

14 రోజుల రిమాండ్‌ తరలింపు

కేశంపేట: భర్తను హత్య చేసిన ఘటనలో నిందితురాలైన భార్యను కేశంపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ నరహరి కథనం ప్రకారం.. మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొప్పు కుమార్‌(35) రోజూ మద్యం తాగి భార్య మాధవిని వేధిస్తుండేవాడు. ఈ నెల 11న రాత్రి సైతం మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. భర్తను ఎలాగైనా అంతం చేయాలని భావించిన మాధవి అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని తల, ఛాతిపై సిమెంట్‌ ఇటుకతో బలంగా మోదింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆమె మృతదేహాన్ని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడేసినట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న రక్తం మరకలను తుడిచి, పౌడర్‌ను చల్లి ఆధారాలు దొరకుండా చేసి పరారైనట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టినట్లు తెలిపారు. కేశంపేట వైఎస్‌ఆర్‌ చౌరస్తా వద్ద మాధవిని సోమవారం అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆమె నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు ఆమెను కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించినట్లు సీఐ తెలిపారు.

నిరుపేదలకు  అండగా ఉంటాం 1
1/3

నిరుపేదలకు అండగా ఉంటాం

నిరుపేదలకు  అండగా ఉంటాం 2
2/3

నిరుపేదలకు అండగా ఉంటాం

నిరుపేదలకు  అండగా ఉంటాం 3
3/3

నిరుపేదలకు అండగా ఉంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement