
బైక్‌ను ఢీకొట్టిన బస్సు
కొత్తూరు: ముందు వెళ్తున్న బైక్‌ను గుర్తు తెలియని బస్సు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలోని పెంజర్ల కూడలి జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన నవీన్(40), మల్లేష్(45) అన్నదమ్ములు. వీరు కొన్నేళ్ల నుంచి రాజేంద్రనగర్ సమీపంలోని కాటేదన్‌లో ఉంటున్నారు. ఆదివారం తమ స్వగ్రామంలో ఓ శుభకార్యం ఉండడంతో ఇద్దరితో పాటు మల్లేష్ కుమారుడు లోకేష్(12) బైక్‌పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముగ్గురు బైక్‌పై బయలుదేరగా పట్టణంలోని పెంజర్ల కూడలి వద్దకు రాగానే వెనకాల నుంచి వచ్చిన గుర్తు తెలియని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు.
ముగ్గురికి తీవ్ర గాయాలు