బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయికి.. | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయికి..

Oct 12 2025 7:47 AM | Updated on Oct 12 2025 7:47 AM

బ్యాడ

బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయికి..

ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో సత్తాచాటిన తాండూరు విద్యార్థులు

స్టేట్‌ లెవల్‌ పోటీలకు

ఎనిమిది మంది ఎంపిక

తాండూరు టౌన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌) జిల్లా స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో తాండూరు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్‌– 14, 17 విభాగాల్లో ఎనిమిది మంది బాలబాలికలు జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. శనివారం పరిగిలో నిర్వహించిన అండర్‌– 14 విభాగం డబుల్స్‌లో సాయి ప్రతీక్‌, అర్జున్‌గౌడ్‌ ప్రథమ స్థానం, సింగిల్స్‌లో సాయి ప్రతీక్‌ ప్రథమ స్థానం, అర్జున్‌ గౌడ్‌ ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలికల అండర్‌– 14 విభాగం డబుల్స్‌లో సందర్శిని, దీక్ష ద్వితీయ స్థానం, బాలికల అండర్‌– 17 విభాగం డబుల్స్‌లో నందిని, మేరీజోన్స్‌ ద్వితీయ స్థానం, బాలుర విభాగంలో మణికంఠ, చరణ్‌ ద్వితీయ స్థానం సాధించారు. ఈ ఎనిమిది మంది వికారాబాద్‌ జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కాగా సెయింట్‌ మార్క్స్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ప్రాక్టీస్‌ చేసి రాష్ట్ర స్థాయికి ఎంపికై న క్రీడాకారులను పాఠశాల ప్రిన్సిపాల్‌ ఆరోగ్యరెడ్డి, పీడీలు రాము, చరణ్‌ అభినందించారు.

జిల్లా పోటీలకు 108 మంది ఎంపిక

శంకర్‌పల్లి: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జోనల్‌ స్థాయి అండర్‌– 14, 17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, వాలీబాల్‌ ఎంపికలు నిర్వహించినట్లు ఎంఈఓ అక్బర్‌, జోనల్‌ సెక్రెటరీ ప్రభాకర్‌ తెలిపారు. మండలం పరిధిలోని మియాఖాన్‌గడ్డలో నిర్వహించిన సెలెక్షన్స్‌లో జోన్‌ పరిధిలోని చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో కబడ్డీ అండర్‌– 14 బాలబాలికల విభాగంలో 15 మంది చొప్పున 30 మందిని, అండర్‌– 17 విభాగంలో 15 మంది చొప్పున 30 మందిని, వాలీబాల్‌ అండర్‌– 14 బాలబాలికల విభాగంలో 12 మంది చొప్పున 24 మందిని, అండర్‌– 17లో 24 మందిని ఎంపిక చేశామన్నారు. వీరు ఈనెల 14న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఫిజికల్‌ డైరెక్టర్లు బస్వరాజ్‌, శంకర్‌, అరుంధతి, పల్లవి, నాగ సంధ్య, అనురాధ, మల్లేశ్‌, రవీందర్‌, శ్రీనివాస్‌, ఆనంద్‌, అశోక్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపికై న విద్యార్థులతో ఎంఈఓ అక్బర్‌, జోనల్‌ సెక్రెటరీ, ఫిజికల్‌ డైరెక్టర్లు

ఎంపికై న విద్యార్థులతో పీడీలు, తదితరులు

బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయికి.. 1
1/1

బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర స్థాయికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement