
వాలీబాల్ టోర్నమెంట్ కోసం ఎంపిక
కొడంగల్ రూరల్: 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ కోసం ఎంపిక నిర్వహించనున్నారు. 13వ తేదీన అండర్14, 17 విభాగంలో బాలబాలికలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సెలక్షన్ నిర్వహిస్తారని జిల్లా కార్యదర్శి అనంతయ్య, జోనల్ కార్యదర్శి అజీజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆధార్ కార్డు, ఎలిజిబిలిటీ ఫామ్, బొనఫైడ్ పత్రాలను వెంట తీసుకొనిరావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 97015 86893, 89787 58124 ఫోన్ నంబర్లపై సంప్రదించాలని తెలిపారు.
సీసీ కెమెరాలు తప్పనిసరి
కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్
కుల్కచర్ల: దుకాణదారులు సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేసుకోవాలని కుల్కచర్ల ఎస్‌ఐ రమేశ్ తెలిపారు. శనివారం ఆయన మండల కేంద్రంలో సీసీ కెమెరాలు లేని దుకాణ యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రమేశ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయన్నారు. నేరాల కట్టడికి బీఎన్‌ఎస్ 144 ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోని దుకాణదారులకు నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. ప్రతీ ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సహకరించాలని కోరారు. కుల్కచర్ల, చౌడాపూర్ మండలాలలోని ప్రతీ దుకాణదారుడికి నోటీసులు అందజేశారు.
విద్యుదాఘాతానికి గురై ఎద్దు మృతి
పూడూరు: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని కెరవెళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని కెరవెళ్లి గ్రామానికి చెందిన బాధితరైతు ఫయాజ్‌కు చెందిన ఎద్దు పొలంలో మేత మేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో ఎద్దు అక్కడిక్కడే మృత్యువాత పడిందని రైతు తెలిపాడు. రైతు పొలం నుంచి ఎల్టీలైన్ తీగలు వ్రేలాడుతుండడంతో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.
స్థల వివాదంలో దాడి
మొయినాబాద్ రూరల్: స్థలం విషయంలో జరిగిన దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్ గ్రామ సమీపంలోని పోల్ట్రీ ఫామ్ దగ్గర 250 గజాల ప్లాట్ ఉంది. దీనిపై రామగళ్ల ఎల్లయ్య కుమారులు నందం, శ్యామ్, శ్రీకాంత్ ముగ్గురికి సమాన హక్కు ఉంది. ఇదే విషయమై శనివారం శ్యామ్ అన్న కుమారుడు ప్రసాద్.. ప్లాట్ వద్ద గొడవకు దిగాడు. బాబాయి అయిన శ్యా మ్(35)పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. విష యం బాధితుడి భార్య అనితకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అక్కడికి చేరుకున్న వా రు.. కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడున్న శ్యాంను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
బెల్టు దుకాణాలపై దాడి
శంకర్‌పల్లి: రెండు బెల్టు దుకాణాలపై మోకిల పోలీసులు దాడులు చేశారు. ఎస్‌ఐ కోటేశ్వర రావు తెలిపిన వివరాల ప్రకారం.. కొండకల్ గ్రా మంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న న ర్సింహ్మారెడ్డి.. అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 23 మద్యం సీ సాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా మోకిలలో రాజు దాబాలో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేయగా.. 5 మ ద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీరిద్దరిపై కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వాలీబాల్ టోర్నమెంట్ కోసం ఎంపిక