
ఇసుక మాఫియా బరితెగింపు
బషీరాబాద్: ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వీరిని పెంచిపోషించారనే ఆరోపణలున్న పోలీసులపైకే ఎదురు తిరుగుతున్నారు. తాజాగా బషీరాబాద్ మండలం నంద్యానాయక్‌తండాలో శుక్రవారం రాత్రి ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకోబోయిన ఇద్దరు కానిస్టేబుళ్లపైకి వాహనం ఎక్కించేందుకు ప్రయత్నించారు. చాకచక్యంగా తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎక్మాయి శివారులోని వాగు నుంచి జమ్లానాయక్‌తండాకు చెందిన చౌహాన్ బాలకృష్ణ అనే డ్రైవర్ ఇసుక లోడ్‌తో నంద్యానాయక్‌తండా వైపు వెళ్తున్నాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుళ్లు అశోక్, రమేశ్ వాహనాన్ని ఆపమని సూచించారు. వీరు సివిల్ డ్రెస్‌లో ఉండటంతో డ్రైవర్ వారిపైకి ట్రాక్టర్‌ను తోలాడు. త్రుటిలో తప్పించుకున్న పోలీసులు వాహనాన్ని వెంబడించారు. ఇది గమనించి డ్రైవర్ నంద్యానాయక్‌తండాలోని ఓ ఇంటి వద్ద ట్రాక్టర్ ఆపేసి, పరారయ్యాడు. వెంటనే అక్కడికి చేరుకున్న యజమాని శ్రీను వాహనాన్ని వదిలేయాలని కోరినా వినకుండా పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తాండూరు రూరల్ సీఐ నగేష్ శనివారం స్టేషన్‌కు చేరుకుని విచారణ జరిపారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసులపైకి ట్రాక్టర్‌ను తోలేందుకు ప్రయత్నించడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈమేరకు ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణతో పాటు యజమాని చౌహాన్ శ్రీనుపై కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ నుమాన్‌అలీ తెలిపారు.
పట్టుబడిన ట్రాక్టర్
ఎక్మాయి వాగు నుంచి
అక్రమంగా రవాణా
అడ్డుకోబోయిన పోలీసులపైకి
ట్రాక్టర్ ఎక్కించే యత్నం
ఛేజింగ్ చేసి పట్టుకున్న వైనం
ఇరువురిపై కేసు నమోదు.. వాహనం సీజ్