
నియామకం
బండ్లగూడ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బండ్లగూడ జాగీర్ మాజీ సర్పంచ్ గంగని హరికృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు నియామకపత్రాన్ని గురువారం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రితం, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ల చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు సాయశక్తుల కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు. తెలంగాణ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ జల్‌పల్లి నరేందర్ పాల్గొన్నారు.