
ప్రజల చూపు బీజేపీ వైపు
● కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితి లేదు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్ గౌడ్
మహేశ్వరం: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేక బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని గొల్లూరు గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో జనం విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో జగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిద్దె సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, పార్టీ సీనియర్ నాయకుడు కడారి జంగయ్య యాదవ్, మండల అధ్యక్షుడు యాదీష్ తదితరులు పాల్గొన్నారు.