డీఎంహెచ్‌ఓ బదిలీ | - | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌ఓ బదిలీ

Oct 1 2025 10:59 AM | Updated on Oct 1 2025 10:59 AM

డీఎంహ

డీఎంహెచ్‌ఓ బదిలీ

జిల్లా ఇన్‌చార్జ్‌ వైద్యాధికారిగా

డాక్టర్‌ పవిత్ర

అనంతగిరి: జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ లలితాదేవి బదిలీ అయ్యారు. ఆమెను రంగారెడ్డికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఎంసీహెచ్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ వై పవిత్రకు ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేస్తామన్నారు.

మంత్రి పొంగులేటిని

కలిసిన మోనికారాణి

కుల్కచర్ల: ఇటీవల విడుదలైన గ్రూప్‌ –1 ఫలితాల్లో జిల్లా రిజిస్ట్రార్‌గా నియమితులైన మోనికారాణి మంగళవారం నగరంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కను బహూకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు.

‘అమ్మ నాన్న’ సేవలు

అభినందనీయం

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీంద్రయాదవ్‌

కొడంగల్‌ రూరల్‌: సమాజ సేవ చేయడం అభినందనీయమని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రవీంద్రయాదవ్‌, తెలంగాణ విద్యా వంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్‌ హాల్‌లో దసరా పండుగను పురష్కరించుకొని అమ్మా నాన్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కొత్త బట్టలు, కిరాణా సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మా నాన్న ఫౌండేషన్‌ ఫౌండర్‌ ప్ర వీణ్‌కుమార్‌ సేవలు స్ఫూర్తిదాయకమ న్నారు. కార్యక్రమంలో సనాతన ధర్మ పరి రక్షణ సమితి సభ్యులు లక్ష్మీనారాయ గుప్తా, మిఠా యి రాజేందర్‌, బాకారం చంద్రశేఖర్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శంకర్‌నాయక్‌, గౌరారం గోపాల్‌, నరేష్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో

మానసిక ప్రశాంతత

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పరిగి: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగి ఆర్టీసీ డిపోలోని దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని సూచించారు. భక్తితోనే ముక్తి లభిస్తుందన్నారు. అనంతరం అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి దర్శించుకున్నారు.

సేవలే గుర్తుండిపోతాయి

అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరకాలం గుర్తుండిపోతాయని ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్‌లో ఎస్‌బీ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఎండీ హఫీజ్‌ ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దాదాపు 41 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో ఉద్యోగం చేయడం గొప్ప విషయమన్నారు.

డీఎంహెచ్‌ఓ బదిలీ  
1
1/4

డీఎంహెచ్‌ఓ బదిలీ

డీఎంహెచ్‌ఓ బదిలీ  
2
2/4

డీఎంహెచ్‌ఓ బదిలీ

డీఎంహెచ్‌ఓ బదిలీ  
3
3/4

డీఎంహెచ్‌ఓ బదిలీ

డీఎంహెచ్‌ఓ బదిలీ  
4
4/4

డీఎంహెచ్‌ఓ బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement