
అటవీ భూమి ఆక్రమిస్తే చర్యలు
యాలాల: అటవీ భూములను ఉద్దేశ పూర్వకంగా చదును చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రాజేందర్ హెచ్చరించారు. మంగళవారం మండల పరిధిలోని రాస్నం అటవీ ప్రాంతంలోని కంపార్ట్‌మెంట్ నంబరు 109లో సంగాయిపల్లితండాకు చెందిన వెంకటేష్, రాస్నం గ్రామానికి చెందిన జేసీబీ చెట్లు, పొదలు చదును చేస్తుండగా అటవీశాఖ అధికారులు గుర్తించి జేసీబీని సీజ్ చేశారు. అనంతరం ఎఫ్‌ఆర్‌ఓ మాట్లాడుతూ.. వెంకటేష్ గతంలో కూడా అటవీ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ విషయంలో చట్టరీత్యా చర్యలతో పాటు సీజ్ చేసిన జేసీబీని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారి కనకరాజు, బీట్ ఆఫీసర్ వీరబాబు, వాచర్లు యాదగిరి, ఆఫ్రీద్, మహేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రాజేందర్