
పండగ పూట జరభద్రం
ఎస్‌ఐ యాదగిరి
దుద్యాల్: దసరా పండుగకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ యాదగిరి సూచించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇళ్లకు తాళాలు జాగ్రత్తగా వేసుకోవాలని సూచించారు. దొంగలు అదును చూసి ఇళ్లను టార్గెట్ చేసి దోచే అవకాశం ఉందన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, డబ్బులు ఉంచరాదని చెప్పారు. చుట్టుపక్కల వాళ్లను ఇంటి వైపు గమనించాలని సూచించారు.
దినసరి కూలీ అదృశ్యం
తాండూరు రూరల్: ది నసరి కూలీ అదృశ్యమైన సంఘటన మండలంలోని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధి లోని చోటు చేసు కుంది. ఎస్‌ఐ రాథోడ్ వినోద్ కథనం ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన చౌహన్ మోహన్‌నాయక్ నిత్యం లారీల్లో నాపరాతి, సిమెంట్ అన్‌లోడింగ్ పనులు చేస్తూంటాడు. ఈ నెల 18న అతను ఇంట్లో పనికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. వారం రోజులైన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అతని ఆచూకీ తెలిస్తే 87126 70052కు తెలపాలని కోరారు.
బతుకమ్మ ఆడుతూఅస్వస్థతకు గురై..
గుండెపోటుతో మహిళ దుర్మరణం
ఇబ్రహీంపట్నం రూరల్: బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురైన ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పీఎస్ పరిఽధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, రంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మి(66) ఆదిబట్లలోని టీసీఎస్ ఎదుట ఉన్న వెంకటేశ్వర హాస్టల్‌లో వంట మనిషిగా పని చేసేది. ఈనెల 21న హాస్టల్‌లో ఉండే మహిళలతో కలిసి బతుకమ్మ ఆడింది. ఈక్రమంలో అలసటగా ఉందంటూ గదిలోకి వెళ్లింది. ఎడమ చేయి లాగుతోందని చెప్పడంతో జండూబామ్ రాసి పడుకోబెట్టారు. ఛాతిలో కూడా నొప్పి వస్తోందని చెప్పడంతో ఆర్‌ఎంపీని పిలిపించారు. పల్స్ బాగా పడిపోవడంతో రాత్రి 12:30 గంటలకు అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా అస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. లక్ష్మి గతంలో సీపీఐఎంఎల్ పార్టీలో క్రియాశీలక సభ్యురాలిగా, ప్రగతిశీల మహిళా సమాఖ్య(పీఓడబ్ల్యూ) సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు. లక్ష్మికి భర్త నాగయ్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడు.

పండగ పూట జరభద్రం