
రూ.కోటి ఇస్తేనే భూములిస్తాం
నవాబుపేట: తమకు ఎకరాకు రూ.కోటి పరిహారం చెల్లిస్తేనే త్రిపుల్‌ఆర్ రోడ్డుకు భూములు ఇస్తామని మండలంలోని చించల్‌పేట రైతులు పేర్కొన్నారు. మంగళవారం త్రిపుల్ ఆర్‌లో భూములు పోతున్న రైతులు గ్రామంలో సమావేశమయ్యారు. రోడ్డు నిర్మాణంలో తమ పట్టాభూములు, సాగుకు వచ్చే పొలాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని లేదంటే ఎకరాకు రూ.కోటి పరిహారం చెల్లిస్తేనే తామ భూములు ఇస్తామని తీర్మానించుకున్నారు. ఇది వరకే స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి స్పీకర్ ప్రసాద్‌కుమార్, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి తమ బాధలు వివరించామన్నారు. కార్యక్రమంలో బాధితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.