
ఆలయ ఆవరణలో స్వచ్ఛ భారత్
యాలాల: ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా మండలంలోని రసూల్‌పూర్ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గురువారం బీజేపీ నాయకులు నిర్వహించారు. మాజీ ఎంపీపీ, బీజేపీ ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్‌గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అంతకుముందు ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా మండలంలో రోజుకో కార్యక్రమం చేపడుతున్నట్లు బాలేశ్వర్‌గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి రామ్యనాయక్ తదితరులు ఉన్నారు.
యాలాలలో మరో కొత్త బోరు
మండల కేంద్రంలో ఎంపీ నిధుల్లో భాగంగా సగర కాలనీలో కొత్త బోరును మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా వేయించారు. సగర కమిటీ హాల్ సమీపంలో పూజల అనంతరం బోరును తవ్వించారు. సగర సంఘం నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.