
మాజీ మంత్రుల ప్రత్యేక పూజలు
కందుకూరు: మండలంలోని లేమూరు పరిధి లోని శ్రీదేవి, భూదేవి సమేత స్వయంభూ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం మాజీ మంత్రులు కె.జానారెడ్డి, జి.చిన్నారెడ్డి, డీకే సమరసింహారెడ్డి దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం గురించి ట్రస్ట్ చైర్మన్ గూడూరు కొండారెడ్డి, దేవాలయ విశిష్టత గురించి స్థపతి శివనాగిరెడ్డి వారికి వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గణేశ్, నాయకులు భాస్కర్‌రెడ్డి, పాండు, కె.జైపాల్‌రెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.