
గణేశ్ లడ్డూ రూ.1.31 లక్షలు
ధారూరు: మండలంలోని కేరెళ్లి గ్రామ హనుమాన్ మందిరంలో ఏర్పాటు చేసిన గణేశ్ లడ్డూ ప్రసాదాన్ని శనివారం వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి పోటీ పడ్డారు. రూ.1.31 లక్షలకు ప్రభాకర్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు నాగిరెడ్డి, దయాకర్‌రెడ్డి, చెన్నారెడ్డి పాల్గొన్నారు.
హస్నాబాద్‌లో రూ.1,04,000
దుద్యాల్: మండలంలోని హస్నాబాద్‌లో వినాయకుడి లడ్డూని గ్రామానికి చెందిన గోపాల్ హన్మంతు రూ.1,04,000 దక్కించుకున్నారు. చేపల సంఘం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూని రూ.71 వేలకు బైండ్ల శివకుమార్ సొంతం చేసుకున్నారు.

గణేశ్ లడ్డూ రూ.1.31 లక్షలు