
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
అనంతగిరి: మహిళలు నచ్చిన రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదగాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీ మహిళకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. సర్టిఫికెట్ల అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం సుధీర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, ఆర్టీఏ సభ్యులు జాఫర్ తోపాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, స్ఫూర్తి గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, ప్రసన్న పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్