
నేడు పాంబండ ఆలయం మూసివేత
కుల్కచర్ల: చంద్ర గ్రహణం నేపథ్యంలో గిరిప్రదక్షిణ, ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం ఉదయం 9:56 గంటలకు పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందని ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, ఈఓ బాలనర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6గంటలకు రుద్రహోమం, 7గంటలకు గిరిప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి ఆలయాన్ని మూసివేసి మరుసటి రోజు సోమవారం ఉదయం 7గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు.
మోమిన్‌పేట: మండలంలోని మేకవనంపల్లి ఉన్నత పాఠశాలలో ఈనెల 8న మండల స్థాయి టీఎల్‌ఎం మేళా నిర్వహించనున్నట్లు ఎంఈఓ మల్లేశం శనివారం ఓ ప్రకటనలో తెలి పారు. మండలంలోని ఆయా ప్రాథమిక,ప్రాథ మికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మేళాకు హాజరుకావాలని సూచించారు. ఉదయం 10గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.
తాండూరు టౌన్: సేవా భారతి, మధుకర సేవా సమితి, కిమ్స్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్యవైశ్య ఓపెన్ ఆడిటోరియంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తాండూరు పట్టణ పరిధిలోని మల్‌రెడ్డిపల్లి, ఇందిరానగర్ కాలనీలకు చెందిన 300 మందికి రక్త పరీక్షలు చేశారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిని ఆపరేషన్‌కు సిఫారసు చేశారు. కార్యక్రమంలో సేవా భారతి ప్రతినిధులు శివశంకర్, వెంకటేష్, రమేష్, శ్రీనివాస్, మధుకర సేవా సమితి వ్యవస్థాపకులు డాక్టర్ విమలాకర్ రెడ్డి, కిమ్స్ ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: మండలంలోని ఉడిమేశ్వరం గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ భవ న నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంతు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, పీసీసీ మెంబర్ మహ్మద్ యూసుఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు హన్మిరెడ్డి, మొగులయ్య, శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీని వాస్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మప్ప, జనార్దన్, సాయిలు, మాసప్ప, మహేష్, సయ్య ద్ పాషా, అంజిలప్ప, ఏఈ రవికిరణ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
హౌసింగ్ ఏఈ రహీం
తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో పనులు పూర్తి చేస్తే వెంటనే బిల్లులు చెల్లిస్తామని పెద్దేముల్ హౌసింగ్ ఏఈ రహీం అన్నారు. శనివారం పెద్దేముల్ మండలం కందనెల్లి తండాలో నిర్మిణ దశలో ఉన్న ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 798 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు సగం ఇళ్ల పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 150 మందికి పునాది పనుల బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. నాలుగు దశల్లో బిల్లులు వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవిత తదితరులు పాల్గొన్నారు.

నేడు పాంబండ ఆలయం మూసివేత

నేడు పాంబండ ఆలయం మూసివేత